Jaiswal: ముంబయిని వీడిన యశస్వీ జైస్వాల్ 5 d ago

యువ బ్యాట్స్ మన్ యశస్వి జైస్వాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కొంతకాలం నుంచి ముంబయి తరపున ఆడుతున్న యశస్వి ఆ జట్టుకు గుడ్ బై చెప్పాడు. గోవాకు మారేందుకు తనకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరూతూ.. ముంబయి క్రికెట్ అసోసియేషన్ కు జైస్వాల్ లేఖ రాశాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను జట్టు మారుతున్నట్లు జైస్వాల్ తన లేఖలో పేర్కొన్నాడు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా కారణం ఉండొచ్చని..అతడి రిక్వెస్ట్ ను అంగీకరించి, జట్టు నుంచి రిలీవ్ చేశాం అని ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు బుధవారం పీటీఐకి వెల్లడించారు.